పదేపదే ప్రసారం వద్దు

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఎలక్ట్రానిక్ మీడియాకు ఎన్నికల సంఘం సూచన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రశాంతతను దెబ్బతీసేలా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో విద్వేషాలు రేగుతాయని, శాంతిభద్రతలు దెబ్బతింటాయని తెలిసి కూడా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు పదేపదే వారి మాటలను ప్రసారం చేస్తున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం తీవ్రంగా స్పందించింది. నాయకులు చేసే వ్యాఖ్యలను అతిశయోక్తిగా పదేపదే చూపిస్తూ వారికి వంతపాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అడ్డుతగిలేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ప్రసంగాలను అదేపనిగా ప్రసారం చేయొద్దని ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ గురువారం సూచించారు.
నియమావళి ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తాం
ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్టు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గుర్తించామని ఎస్ఈసీ వెల్లడించింది. ప్రచారంలో అభ్యర్థుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడొద్దని, పార్టీలపై నిరాధార విమర్శలు చేయరాదని స్పష్టంచేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు, ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్ఈసీ సూచించింది. నిబంధనలను ఉల్లంఘించొద్దని ఆదేశిస్తూ ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అడ్డుతగిలేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ప్రసంగాలను అదేపనిగా ప్రసారం చేయొద్దు.
- ఎలక్ట్రానిక్ మీడియాకు ఎన్నికల సంఘం సూచన
తాజావార్తలు
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
- ‘గ్రాజియా’ ఫీచర్స్...అదుర్స్...!
- 27న జైలు నుంచి శశికళ విడుదల
- బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలతో టాటా టైఅప్.. అందుకేనా?!
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- సార్క్ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ : విదేశాంగ శాఖ
- వరుణ్‌ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవాలు దానం
- నడ్డా ఎవరు? ఆయనకెందుకు సమాధానమివ్వాలి: రాహుల్ సైటైర్లు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!