మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 01:22:50

రెండ్రోజులు ధాన్యాన్ని తేవొద్దు

రెండ్రోజులు ధాన్యాన్ని తేవొద్దు

  • మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నివర్‌ తుఫాన్‌ ముంచుకొస్తున్న తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం సూచించారు. తుఫాను ప్రభావం దక్షిణ తెలంగాణపై అధికంగా ఉండే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. రెండ్రోజులపాటు పత్తి, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దని సూచించారు. ఇప్పటికే కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పడంతోపాటు ఇతర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులెవరూ కొనుగోలు కేంద్రాలను వదిలి వెళ్లొద్దని ఆదేశించారు. జిల్లా, రీజినల్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకోవాలని సూచించారు.