గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 15:28:21

దళారులను ఆశ్రయించి మోసపోవొద్దు : ఎమ్మెల్యే కందాళ

దళారులను ఆశ్రయించి మోసపోవొద్దు : ఎమ్మెల్యే కందాళ

ఖమ్మం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి  ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.

రైతు మార్కెట్‌ యార్డ్‌కు వెళ్లి తమ ధాన్యాన్ని విక్రయించు కోవడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాల‌కు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని  సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, డీసీఎంస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ వజ్జా రమ్య, డీసీఎంస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.