మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:03

రైతువేదిక పనులు వేగంగా చేయండి

రైతువేదిక పనులు వేగంగా చేయండి

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ/పెబ్బేరు రూరల్‌: రైతు వేదిక నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తక్కశిల, ఇటిక్యాల మండలం పుఠాన్‌దొడ్డి, మానవపాడు మండలం కలుకుంట్ల, జల్లాపూర్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు వేదికలు భవిష్యత్తులో రైతన్నలకు బాసటగా నిలువనున్నాయని తెలిపారు. రైతులకు సంపూర్ణ అండదండలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టంచేశారు.   గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, గట్టు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. 


logo