గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:27

ఫ్లేమ్‌ వర్సిటీకి గురుకుల ‘దివ్య’

ఫ్లేమ్‌ వర్సిటీకి గురుకుల ‘దివ్య’

  • ప్రముఖ విశ్వవిద్యాలయానికి పేద విద్యార్థిని ఎంపిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆ చదువుల బిడ్డది నిరుపేద కుటుంబం.. తండ్రి చిరు వ్యాపారి.. కుటుంబమంతా కడుపునిండా భోజనం చేయాలంటే పొద్దస్తమానం కష్టపడాలి.. అలాంటిది బిడ్డను గొప్ప చదువులు చదివించడం ఆయనకు కష్టంగా మారింది.. కానీ, ‘గురుకుల’ గుడి ఆయన కలను నిజం చేసింది. ఆయన కూతురి బంగారు భవిష్యత్తును ‘దివ్య’ంగా మార్చింది. ఫలితంగా ఆ చదువుల బిడ్డ గొప్ప యూనివర్సిటీలో చదువుకునేందుకు సీటు సంపాదించుకున్నది. నారాయణపేట జిల్లా నర్వ గ్రామానికి చెందిన పెద్దింటి దివ్య గౌలిదొడ్డి ఎస్సీ గురుకులంలో మంచి మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసింది. ఆమె ప్రతిభను గుర్తించిన మహారాష్ట్రలోని ఫ్లేమ్‌ యూనివర్సిటీ ఉచితంగా సీటు ఇచ్చేందుకు అంగీకరించింది. బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌, కమ్యూనికేషన్‌) కోర్సులో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆ విద్యార్థినికి లేఖ రాసింది. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గురుకులాలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న కారణంగానే తనలాంటి పేద విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతున్నాయని తెలిపింది. ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. కాగా, గౌలిదొడ్డి గురుకులం నుంచే ఇద్దరు విద్యార్థినులు ప్రముఖ క్రే వర్సిటీలో ఉచితంగా సీటు దక్కించుకున్న విషయం తెలిసిందే.logo