మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 15:25:57

దివీస్ లేబోరేట‌రీస్ రూ. 5 కోట్ల విరాళం

దివీస్ లేబోరేట‌రీస్ రూ. 5 కోట్ల విరాళం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు వెలువెత్తున్నాయి. తాజాగా దివీస్ లేబోరేట‌రీస్ రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది.  పౌల్ర్టీ బ్రీడ‌ర్స్ అసోసియేష‌న్‌ రూ. కోటి విరాళం అందించింది. లారూస్ ల్యాబ్స్ రూ. 50 ల‌క్ష‌లు, జీఎంఆర్ హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు రూ. 2.5 కోట్లు, స్నేహ ఫౌండేష‌న్ రూ. కోటి, శ్రీ చైత‌న్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ ప్ర‌యివేట్ లిమిటెడ్ రూ. కోటి విరాళం అందించారు. ఈ సంస్థ‌ల ప్ర‌తినిధులు చెక్కుల‌ను మంత్రి కేటీఆర్‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అందించారు. ఈ సంద‌ర్భంగా వీరంద‌రికి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

హెటిరో డ్రగ్స్‌ సంస్థ నిన్న రూ.10 కోట్ల విరాళాన్ని అందజేసింది. సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్న ట్టు సంస్థ చైర్మన్‌ పార్థసారథిరెడ్డి తెలిపారు. రామోజీగ్రూప్‌ సంస్థ చైర్మన్‌ రామోజీరావు ప్రకటించిన రూ.5 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు నిన్న అందించిన విష‌యం తెలిసిందే.