గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 17:12:43

జిల్లా జ‌డ్జి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

జిల్లా జ‌డ్జి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్ : ‌రాష్ర్టంలో ఖాళీగా ఉన్న జిల్లా జ‌డ్జి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. తెలంగాణ స్టేట్ జ్యుడిషీయ‌ల్ స‌ర్వీస్ ఈ పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. మొత్తం 9 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఓపెన్ కేట‌గిరిలో మొత్తం 5 పోస్టులు ఉండ‌గా.. రెండు పోస్టులు మ‌హిళ‌ల‌కు కేటాయించారు. బీసీ కేట‌గిరిలో ఒక పోస్టు(మ‌హిళ), ఎస్సీ కేట‌గిరిలో రెండు పోస్టులు(ఒక‌టి మ‌హిళ‌కు), ఎస్టీ కేట‌గిరిలో ఒక పోస్టు(మ‌హిళ‌) ఖాళీగా ఉంది. ఇత‌ర వివ‌రాల కోసం https://tshc.gov.in/getRecruitDetails వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.