శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 05, 2020 , 01:27:53

అటవీ భూములు కబ్జా చేస్తే సహించం

అటవీ భూములు కబ్జా చేస్తే సహించం
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి
  • రైతులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాపత్రాల పంపిణీ

బాన్సువాడ, నమస్తే తెలంగాణ: అటవీ భూము లు కబ్జాచేస్తే సహించేదిలేదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చిన్నరాంపూర్‌ గ్రామానికి చెందిన 84 మంది రైతులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన పత్రాలను మంగళవారం  స్పీకర్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతోకాలంగా అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య ఉన్న సమస్యలను బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌, అధికారులు పరిష్కరించినట్టు తెలిపారు. ఈ పట్టా భూములకు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తాయన్నారు. 


logo