శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 16:51:33

లబ్ధిదారులకు షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఖమ్మం నుంచి వివిధ దవాఖానల్లో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను ఆయా లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు. నేటి వరకు రూ.3.35కోట్ల విలువైన చెక్కులను అందజేశామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.logo