బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Aug 08, 2020 , 22:10:13

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

 నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

వనపర్తి : మహిళలు స్వయం ఉపాధితో రాణించి ఆర్థికంగా లబ్ధిపొందాలని రాష్ర్ట‌ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద‌లైన 70 మంది మహిళలకు మంత్రి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల్లో ఆర్థికంగా ఎదగాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నారు. ఇంటి వద్ద తమ పనులను చేసుకుంటూనే కుట్టు వృత్తిలో రాణించాలని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్లి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు పేద మహిళలు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ...

వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరగాలన్నదే సీఎం కెసీఆర్‌ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్ష్మయ్య నాయకులు, భాదిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. logo