ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:21:12

నెరవేరిన పేదల సొంతింటి కల

నెరవేరిన పేదల సొంతింటి కల

  • ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వెల్లడి
  • జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌లో రెండో విడత ఇండ్ల పంపిణీ

ఇబ్రహీంపట్నం: పేదోడు పెద్దోడు కావాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌లో రెండో విడతలో నిర్మించిన 25 డబుల్‌ బెడ్రూం ఇండ్లను జెడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. ఇండ్లు రాని వారు నిరాశ చెందవద్దని మరో విడతలో అర్హులకు అందిస్తామన్నారు. logo