ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 14:53:27

పండుగను సంబురంగా జరుపుకునేందుకే చీరెల పంపిణీ

 పండుగను సంబురంగా జరుపుకునేందుకే చీరెల పంపిణీ

ఆదిలాబాద్ : రాష్ట్రంలోని పేదలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్‌లో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ప్రభుత్వం బతుకమ్మ చీరెలతో పాటు రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిణీ చేస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 27 వేల మంది మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు వానకాలంలో సాగు చేసిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అలాగే గ్రామాల్లో ప్రజలు తమ ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.


logo