శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 13:06:47

పండుగను సంబురంగా జరుపుకునేందుకే చీరెల పంపిణీ

పండుగను సంబురంగా జరుపుకునేందుకే చీరెల పంపిణీ

మంచిర్యాల : మహిళలందరికి పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరెలను ఇస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే  బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గ  కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.317 కోట్ల వ్యయంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరెలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. 18 ఏండ్లు నిండి, తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరెలు అందిస్తున్నామని చెప్పారు.


logo