గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 06:38:37

ఎల్బీనగర్ పరిధిలో నేడు శానిటైజర్‌ బాటిల్స్‌ పంపిణీ

ఎల్బీనగర్ పరిధిలో నేడు శానిటైజర్‌ బాటిల్స్‌ పంపిణీ

హైదరాబాద్ : కరోనా సోకకుండా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు ఎల్బీనగర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా శానిటైజర్‌ బాటిల్స్‌ను పంపిణీ చేస్తామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం లింగోజిగూడ డివిజన్‌లోని మహిళా సంఘాలతో చేతి శానిటైజర్స్‌ను స్వతాహాగా తయారు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావుతో కలిసి శానిటైజర్స్‌ తయారీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ... నియోజకవర్గంలోని బస్‌స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌ వద్ద మహిళాసంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన శానిటైజర్స్‌ను నేటి నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మాస్కులను టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రావుతో పాటుగా మధుసాగర్‌, ప్రవీణ్‌రెడ్డి, మహిళా నాయకులు దుర్గాలక్ష్మి, పార్వతీగౌడ్‌, సరళ, లక్ష్మి, ప్రసన్న, అనూష, లక్ష్మీదేవి పాల్గొన్నారు.      


logo
>>>>>>