బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 02:16:19

నేటినుంచి రేషన్‌ బియ్యం పంపిణీ

నేటినుంచి రేషన్‌ బియ్యం పంపిణీ

  • రద్దీ ఉండకుండా టోకెన్ల జారీ: పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఇప్పటికే గురువారం బియ్యం పంపిణీచేసే ప్రాంతాలకు టోకెన్లు ఇచ్చామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారంనుంచి బియ్యం ఇస్తామని చెప్పారు. రూ.1,103 కోట్లతో 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని సర్కారు అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్లరేషన్‌కార్డు, అంత్యోదయకార్డుల ఆధారంగా పేదలకు బియ్యం, నగదు అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఏర్పాట్లుచేశామని కమిషనర్‌ చెప్పారు. రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్‌కార్డులున్నాయని తెలిపారు. ఒకేసారి రేషన్‌షాపుల వద్ద కార్డుహోల్డర్లు గుమిగూడకుండా టోకెన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎవరు ఏ సమయంలో రావాలో టోకెన్‌లో పేర్కొంటున్నట్టు వెల్లడించారు. రేషన్‌కార్డుదారుల ఆధార్‌నంబర్ల ఆధారంగా అకౌంట్లలో రూ.1500 వేయడానికి ఏర్పాట్లుచేస్తున్నట్టు తెలిపారు.


logo
>>>>>>