గురువారం 28 మే 2020
Telangana - May 12, 2020 , 12:39:39

ఎన్నారైల ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

 ఎన్నారైల ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

హైదరాబాద్‌ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలో  టీఆర్ఎస్‌ సౌతాఫ్రికా శాఖ ఎన్నారైలు  కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరు పేదలకు మేమున్నామంటూ ముందుకొచ్చారు. పలు తండా వాసులు, వివిధ గ్రామాల్లోని ప్రజలకి  మాస్కులు అందజేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  స్థానిక ఎమ్మెల్యే  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు.  అలాగే నిరుపేదలు, వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పోలీసులకు శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సౌతాఫ్రికా ఎన్నారైలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తామని  తెలిపారు.logo