గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 15:10:39

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కుమ్రం భీం ఆసిఫాబాద్ : పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్లకు ప్రభుత్వం చేస్తున్న సహాయం మరువలేనిదని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలోని బాలాజి అనుకోడా, బాబాసాగర్, గంగపూర్, రవీంద్రనగర్ తో పాటు ఆయాగ్రామల లబ్ధిదారులకు కల్యాణ లక్మి చెక్కులను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటికి పెద్ద కొడుకులా మారి వారి కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నానయ్య, డీసీఎ౦ఎస్ ఉమ్మడి జిల్లా వైస్ చెర్మెన్ కొమురం మంతయ్య, తహసీల్దార్ బికర్ణదాస్, ఎంపీడీవో రమేష్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo