సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 17:51:45

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ : నిరుపేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో 245మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా మారాడని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులు భరోసాగా ఉంటున్నారని తెలిపారు. ఆడబిడ్డల పెండ్లిండ్లకు ప్రభుత్వమే సాయమందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo