మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 11:21:10

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్ ల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్ ల పంపిణీ

వరంగల్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నడికూడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను  147 మంది లబ్ధిదారులకు రూ.1,46,17,052 విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దశాబ్దాల కాలంగా బూజుపట్టిన చట్టాలను తిరగ రాసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందన్నారు. 


logo