ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 14:57:57

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం :  గతంలో పేద ప్రజలు ఆడపిల్లల పెండ్లి చేయాలంటే భయపడేవారని, నేడు ఆ పరిస్థితి లేదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. జిల్లాలోని బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో  లబ్ధిదారులకు రూ. 88  లక్షల 36 వేల  కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పని చేస్తున్నారని తెలిపారు. 

పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశ పెట్టి, పేదింటి ఆడబిడ్డల కష్టాలు దూరం చేశారన్నారు. కార్యక్రమంలో బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణా రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, నాయకులు, అధికారులు  పాల్గొన్నారు.


 logo