బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 12:53:12

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వరంగల్ రూరల్ : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు కోటి 19 లక్షల 13 వేల రూపాయల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లు భారం కావొద్దనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం పది మంది లబ్ధిదారులకు  రూ. 1.97 లక్షల విలువ చేసే సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo