గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 13:02:24

నల్లగొండలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

నల్లగొండలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

నల్లగొండ : నల్గొండ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి  మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి తో పాఠశాలలు తెరవడం కష్టమని, తద్వారా విద్యార్థులు ఇంటివద్ద చదువుకోవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టిందన్నారు. 

విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని ఉధ్యాయులకు సూచించారు.  వైరస్ బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


logo