గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 14:46:05

పాలేరు జలాశయంలో చేప పిల్లలు వదిలిన మంత్రి

పాలేరు జలాశయంలో చేప పిల్లలు వదిలిన మంత్రి

ఖమ్మం : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కుల వృత్తుల ప్రోత్సాహానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి ఆయన 2లక్షల చేప పిల్లలను వదిలారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే అన్ని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు పంపిణీ చేపట్టామన్నారు. ప్రభుత్వం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 22కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయగా ఈ ఏడాది 70కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కుంటలు, చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్య శాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది జిల్లాలోని చెరువులలో 3.45 కోట్ల చేప పిల్లలను వదిలిన్నట్లు తెలిపారు. 


జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వాతంత్య్రం కోసం సమిష్టి కృషి చేయాలన్నారు. అనంతరం పాలేరు పార్క్ ను సందర్శించారు. కొవిడ్ లో భాగంగా పార్క్ మూసివేశరని పార్క్ కలతప్పిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం మళ్ళీ ప్రజలకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మత్స్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.