బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 18:16:02

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సహకారంతో నిత్యావసరాలు పంపిణీ

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సహకారంతో నిత్యావసరాలు పంపిణీ

నల్లగొండ : టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సభ్యుల సహకారంతో నల్లగొండ పట్టణంలో మూడవ విడతగా నేడు నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ యామ కవిత, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుడు యామ దయాకర్‌ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు, అర్హులైన నిరుపేదలు దాదాపు 102 కుటుంబాలకు పది రకాల వస్తువులను పంపిణీ చేశారు. ప్రవాసుల సాయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ జర్మనీ సభ్యులు స్పందిస్తూ.. నిత్యం తమ వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్న మహేష్‌ బిగాల, జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
logo