గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 01:29:45

పేదల పెన్నిధి

పేదల పెన్నిధి

  • దాచుకున్న డబ్బుతో నిత్యావసరాలు పంపిణీ
  • నస్రీమ్‌ దాతృత్వంపై ప్రశంసలు

పోచమ్మమైదాన్‌: నస్రీమ్‌ ఓ నిరుపేద మహిళ.. కూలి పనులు చేస్తూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో జీవనం కొనసాగిస్తున్నది. స్థానికంగా ఉన్న పేపర్‌ ప్లేట్స్‌ కంపెనీలో రోజుకు రూ.160 సంపాదిస్తున్నది. వచ్చిన దాంట్లో కొంత కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెట్టి మిగతా డబ్బులు పొదుపు చేసుకుంటున్నది. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో పొరుగునే నివసిస్తున్న నిరుపేదల ఇబ్బందులు చూసిన ఆమె హృద యం చలించిపోయింది. తాను పైసా పైసా కూడబెట్టుకున్న రూ.15 వేలతో బియ్యంతోపాటు నాలుగు రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేసి, 50 మందికి పంపిణీ చేసింది. చేతినిండా డబ్బులు లేకపోయినా దాచుకున్న డబ్బులను తనలాంటి నిరుపేదలకు ఖర్చు చేయడం ఎంతో తృప్తినిచ్చిందని నస్రీమ్‌ తెలిపారు. నస్రీమ్‌ దాతృత్వాన్ని పలువురు ప్రశంసించారు.logo