బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 11:58:41

పోచారం మున్సిపాలిటీలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

పోచారం మున్సిపాలిటీలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని శివాస్‌ గార్డెన్‌లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దాదాపు 700 మంది నిరుపేదలకు, మున్సిపల్‌ సిబ్బందికి బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo