గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 12:47:24

మంత్రి పువ్వాడ దాతృత్వం... 5 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

మంత్రి పువ్వాడ దాతృత్వం... 5 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

ఖమ్మం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మరోమారు తన దాతృత్వాన్ని చూపారు. కరోనా కష్టకాలంలో తన పుట్టినరోజు సందర్భంగా 10 వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేసిన మంత్రి తాజాగా 5 వేల ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో సతీమణి వసంతలక్ష్మీతో కలిసి మంత్రి నిరేపేద ముస్లింలకు రంజాన్‌ కానుకగా తోఫాను అందజేశారు. సొంత ఖర్చులతో డ్రై ఫ్రూట్స్‌తో సహా పది రకాల నిత్యవసర సరుకులను ముస్లిం కుటుంబాలకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo