మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 17:37:17

‘లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ’

‘లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ’

వరంగల్ రూరల్ : అనారోగ్యానికి గురై ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులతో బాధపడుతున్న 96 మంది భాదితలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. హన్మకొండలోని తమ నివాసంలో పరకాల మున్సిపాలిటీలో 11, పరకాల మండలంలో 6, నడికూడ మండలంలో 9, దామెర మండలంలో 11, ఆత్మకూరు మండలంలో 15, గీసుగొండ మండలంలో 21, సంగెం మండలంలో 17,ఇతరులకు 6 మొత్తం 96 మందికి గాను రూ.32.64 లక్షల విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ఏదైనా పెద్దవ్యాధి సోకితే చావే అని భావించే రోజులకు సీఎం కేసీఆర్ స్వస్తి పలికారన్నారు. 

ఎలాంటి వ్యాధికైనా చికిత్స చేసేలా ప్రభుత్వ ధవాఖానాలను తీర్చిదిద్దారని కొనియాడారు .పేదవారి కుటుంబంలో ఎలాంటి కష్టమొచ్చినా పాలుపంచుకోవాలనే సీఎం సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. బంగారు తెలంగాణే  ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ కు మద్దతుగా ప్రజలున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.logo