బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 12:50:30

60 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

60 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

 ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి 60 మంది లబ్ధిదారులకు  సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని తెలిపారు. 

సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తుండటంతో ప్రజల్లో ఆయనపై గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం ఏకతాటిపై కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo