శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 17:27:26

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

నిజామాబాద్ : నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరమని నిజామాబాద్‌ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తున్న చేసుకున్న 20 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావ్, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.