సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 17:31:41

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి నియోజవర్గానికి చెందిన 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 23,32,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లిలో పంపిణీ చేశారు. ఈ సందదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న నిరుపేదల ప్రాణాలను కాపాడేందు తెలంగాణ సర్కార్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. 

ఆర్థిక స్థోమతలేక వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ వైద్య సేవలకు నోచుకోని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. పేదల ప్రాణాలను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. 


logo