మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 16:11:44

ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్‌, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ

ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్‌, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ

హైదరాబాద్‌ : భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో చాలాకాలనీల్లో వరద నీరు నిలిచింది. దీంతో పైపులైన్ల లీకై వరద నీరు సంపుల్లోకి, ట్యాంకుల్లోకి చేరి నీరు అపరిశుభ్రమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు.

సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్‌ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని జలమండలి సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్‌లో సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. న‌గ‌రంలో ప్రజలు తాగునీటి విష‌యంలో కొన్నిరోజులు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. కాచివ‌డ‌పోసిన నీటిని తాగితె సీజ‌న‌ల్ వ్యాధులు దరిచేరవని చెప్పారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవ‌స‌ర‌మైన వైద్య సదుపాయాలు  కల్పిస్తామని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo