గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 18:54:45

దివ్యాంగుల‌కు బ్యాట‌రీ ఆప‌రేట‌ర్ ట్రై సైకిళ్ల పంపిణీ

దివ్యాంగుల‌కు బ్యాట‌రీ ఆప‌రేట‌ర్ ట్రై సైకిళ్ల పంపిణీ

జ‌గిత్యాల : జిల్లాలోని గొల్లపల్లి మండలం ఏడీఐపీ పథకం ద్వారా మొత్తం 25 మంది అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటర్ ట్రై  సైకిళ్లు మంజూరు అయ్యాయి. ఈ ట్రై సైకిళ్ల‌ను రాష్ర్ట సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ శుక్రవారం గొల్లపల్లి కేంద్రంలో లబ్ధిదారులకు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, జెడ్‌పీటీసీ గొస్కుల జలేంధర్, ఎంపీపీ నక్క శంకర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, ఏఎంసీ ఛైర్మన్ ముస్కు లింగాల రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్లు రాజ సుమన్ రావు, మాధవరావు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ బోయపోతు గంగాధర్, పార్టీ అధ్యక్షులు, బొల్లం రమేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు  పాల్గొన్నారు. 
logo