ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 21:01:47

సైబరాబాద్‌ పోలీసులకు ఉసిరికాయల పంపిణీ

సైబరాబాద్‌ పోలీసులకు ఉసిరికాయల పంపిణీ

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నియంత్రణలో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు ఉన్నారు. ప్రజలను గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చూడటంతోపాటు కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నదీ లేనిదీ గమనిస్తూ హెచ్చరించడంలో పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ బారిన పడి దవాఖాన పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి.  

వేసవి వేడిని తట్టుకొంటూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల ఆరోగ్యం బాగుండాలని మహిళా పారిశ్రామికవేత్తలు ఆకాంక్షించి వారిలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడే ఉసిరికాయలు అందించారు. ఈ మేరకు మంగళవారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసి 3 టన్నుల ఉసిరి కాయలను అందించారు. సజ్జనార్‌ను కలిసిన వారిలో వీ హబ్‌కు చెందిన మహిళ పారిశ్రామికవేత్తలు కీర్తీ ప్రియ, దీప్తీ రావుల, శకుంతలతోపాటు అదనపు డీసీపీ లావణ్య, సైబరాబాద్‌ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ అదనపు డీసీపీ మాణిక్‌రాజ్‌ పాల్గొన్నారు. 


logo