శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:44

1.51 కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీ

1.51 కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీ

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

వికారాబాద్‌/నవాబుపేట: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 26.37 లక్షలపై చిలుకు విద్యార్థులకు 1.51 కోట్ల పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్ల్లో రైతు వేదిక భవనాల నిర్మాణాలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక భవనాలకు ప్రభుత్వం రూ.520 కోట్లను కేటాయించిందన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేసేందుకు ప్రభుత్వం రైతు వేదికల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. 


logo