ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:26:20

చీరె సంబురం

చీరె సంబురం

  • ముమ్మరంగా బతుకమ్మ చీరెల పంపిణీ
  • నిండుమనసుతో దీవిస్తున్న మహిళలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పండుగ వేళ ఏ గ్రామంలో చూసిన మహిళల కండ్ల ల్లో బతుకమ్మ చీరె సంబురం కనిపిస్తున్నది. ఇంటికి పెద్ద కొడుకులా మారి సీఎం కేసీఆర్‌ ఏటా అందజేస్తున్న చీరెలను అందుకుంటున్న ఆడబిడ్డల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పుట్టింటి సారెలా రంగురంగుల చీరెలను అందుకొని నిండుమనసుతో దీవిస్తున్నారు. మూడోరోజైన ఆదివారం ఎన్నికల కోడ్‌ ఉన్న ప్రాంతాలను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా చీరెల పంపిణీ కార్యక్రమం వేడుకగా సాగింది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధు లు చీరెలను పంపిణీచేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లి ప్రణయ్‌ పార్కులో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చీరెలను అందజేశారు. సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ మండలంలోని బొక్కలోనిపల్లిలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చీరెలు పంపిణీచేశారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలం ఆరెగూడెంలో విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చీరెలు పంపిణీ చేశారు. 


logo