శనివారం 04 జూలై 2020
Telangana - Feb 20, 2020 , 07:23:46

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం..

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం..

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది. విదేశాల్లో కొనసాగుతున్న ప్లాగింగ్‌ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షుడు గణేశ్‌ మాట్లాడుతూ.. ప్రజలంతా తమ బాధ్యతగా ప్లాస్టిక్‌ను  విచ్చలవిడిగా వాడకుండా, స్వీయనియంత్రణ పాటించాలని, పర్యావరణానికి ముప్పుకలిగిస్తున్న ప్లాస్టిక్‌ను ఉద్యానవనాల పరిసర ప్రాంతాల్లోకి అనుమతించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మహిపాల్‌రెడ్డి, సుకన్య, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు.


logo