గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 12:17:27

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ‘దిశ’ తండ్రి ఆందోళన

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ‘దిశ’ తండ్రి ఆందోళన

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆదివారం ‘దిశ’ తండి శ్రీధర్‌రెడ్డి ఆందోళన చేపట్టారు. దిశ సంఘటన నేపథ్యంగా ‘దిశ ఎన్‌కౌంటర్‌’ పేరుతో చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు మద్దతుగా పలువురు మహిళా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారిని వర్మ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దిశ ఎన్‌కౌంటర్‌ను సినిమాను ప్రభుత్వం బ్యాన్‌ చేయాలని కోరారు. కాగా, ఆయన సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కుమార్తెను కోల్పోయి ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని వాపోయారు. యూట్యూబ్‌లో పెట్టిన ట్రైలర్‌కు వస్తున్న కామెంట్లు మమ్మల్ని బాధిస్తున్నాయన్నారు. సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలని కోరారు. అలాగే దిశపై యూట్యూబ్‌లో వస్తున్న అనుచిత వార్తలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ‌లో 2019 నవంబ‌ర్‌లో జ‌రిగిన దిశా లైంగిక దాడి ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ‘దిశా ఎన్‌కౌంటర్‌’ పేరుతో సినిమా తీస్తున్నారు. గత నెలలో సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. వ‌ర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo