సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 20:15:43

ప్రజల సహకారంతో వ్యాధి ప్రబలదు...

ప్రజల సహకారంతో వ్యాధి ప్రబలదు...

నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కరోనా నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండటమే శ్రీరామ రక్ష  అని సీఎం కేసీఆర్ చెప్పటంతో ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన 3480 మంది నుంచి 2220 మంది 14 రోజుల క్వారంటీన్ పూర్తయ్యింది.  ప్రజలు స్వయంగా గృహ నిర్భందం లో ఉండి సహకరిస్తున్నారు. లాక్ డౌన్ వరకు ప్రజలు స్వీయ నిర్భందం పాటించాలి. జిల్లా నుంచి 29 మందికి టెస్ట్ రిపోర్ట్ పంపాము. 14 మందికి నెగిటివ్ వచ్చింది. ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా వారివి త్వరలోనే రిపోర్ట్ వస్తాయి. 3 సెంటర్లలో 98 మందిని క్వారంటైన్ లో ఉంచాం.ఇంకా క్వారంటైన్ సెంటర్లను పెంచుతాం. 33 మంది ఐసోలేషన్ సెంటర్లలో ఉన్నారు. ప్లాన్ 2, 3 లో 590 మందికి కూడా ఐసోలేషన్ చేసేలా ఏర్పాటు చేస్తాం. ప్రజల సహకారంతో వ్యాధి ప్రబలదు. ఒక్కో వెంటిలేటర్లో 5 గురుకి చికిత్స చేసే టెక్నాలజీ తెస్తున్నాం.

దయచేసి ఇంకో 8 రోజులు ప్రజలు ఇలాగే సహకారం ఇవ్వాలి. మే చివరి వరకు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతాం. కూరగాయల ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒకే చోట రద్దీ ఉండకుండా మొబైల్ మార్కెట్ లు సైతం టౌన్ లలో పెడుతున్నాo. రైతుల ధాన్యం ఒకే సారి మార్కెట్ వెళ్లకుండా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 547 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతంలో కంటే రెండింతల కొనుగోలు కేoద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు కూపన్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తాం ఇందుకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలకు 12 కిలోలు బియ్యం, ఒక్కరికి రూ. 500 చొప్పున ఇస్తున్నాం.  జిల్లాలో ఉన్న 11 వేల మంది వలస కూలీలకు బియ్యం, డబ్బులు ఇస్తున్నాం. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఢిల్లీ నుంచి వచ్చిన వారు జిల్లలో 53 మంది ఉన్నారు. 44 మంది క్వారంటీన్ సెంటర్లో ఉన్నారు. 6 గురికి చికిత్స అందిస్తున్నాం. కరోనా అనుమనం ఉన్న వ్యక్తి ఓ వ్యక్తి గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు. 

మక్కల కొనుగోలు కోసం 48 కేంద్రాలు మరో 108 సబ్ సెంటర్లు పొద్దుతిరుగుడు 10 శనగలకు 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్డులు లేని వలస కూలీలకు  బియ్యం  నగదు  పంపిణీ చేస్తున్నామని  ఇప్పటివరకు    86 క్వింటాళ్లు  ఇచ్చామని  జిల్లాలో మొత్తం 11 వేల మంది ఉన్నట్లు అంచనాకు వచ్చామన్నారు.


logo