బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 12:09:12

పరిశుభ్రతతో వ్యాధులు దూరం : మంత్రి సత్యవతి రాథోడ్

పరిశుభ్రతతో వ్యాధులు దూరం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా.. మహబూబాబాద్ లోని తన నివాసంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న చెట్ల మురుగును తొలగించి పరిశుభ్రం చేశారు.

రోగాలు వచ్చిన తర్వాత చికిత్స కోసం కంగారు పడడం కంటే అవి రాకుండా నివారించే పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం మంచిదన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆరోగ్య తెలంగాణ కోసం అందరూ పాటుపడాలన్నారు.


logo