బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:43

గాంధీలో కరోనా రోగులపై వివక్ష అబద్ధం

గాంధీలో కరోనా రోగులపై వివక్ష అబద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో కరోనా రోగుల దురవస్థ ఇది. దవాఖాన కారిడార్‌లో రోగులను వదిలేసి, ఎవరూ పట్టించుకోవడం లేదు. పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులతో కనిపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఇది అబద్ధం.

ఆ వీడియో గాంధీ దవాఖానలోనిదే. పీపీఈ కిట్లు ధరించినవాళ్లు కరోనా రోగులు కాదు. దవాఖాన సిబ్బంది. విధి నిర్వహణలో అలసిపోయి కారిడార్‌లోనే అలా సేదతీరుతున్నారు. ఇది చాలారోజుల కిందటి వీడియో. సిబ్బందిని రోగులుగా చిత్రీకరిస్తూ ఎవరూ పట్టించుకోవడంలేదని  దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనా చికిత్స పొందే రోగులు పీపీఈ కిట్లు ధరించరు. కేవలం సిబ్బంది మాత్రమే ఇవి వేసుకుంటారు.  logo