శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 28, 2020 , 09:34:46

ఆస్పత్రుల్లో ఖాళీ పడకల వివరాల వెల్లడి

ఆస్పత్రుల్లో ఖాళీ పడకల వివరాల వెల్లడి

హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న వేళ రోగులు ఎలాంటి వైద్య ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,616 ఐసీయూ పడకలు ఉండగా వీటిలో 272 మందికి చికిత్స అందిస్తున్నామని, మరో 1,344 పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,537 ఆక్సిజన్‌ పడకలుండగా 1,383 పడకల్లో రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. మరో 2,154 ఆక్సిజన్‌ పడకలు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని 55 కోవిడ్‌ ఆస్పత్రుల్లో 4,497 పడకలు ఉండగా 3,032 పడకల్లో చికిత్స అందిస్తుండగా మరో 1,465 పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌లో ఉన్న పడకలను వినియోగించుకోవచ్చని సూచించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo