శనివారం 30 మే 2020
Telangana - May 13, 2020 , 13:06:18

క్రమశిక్షణ తోనే కట్టడి చేయగలిగాం

 క్రమశిక్షణ తోనే  కట్టడి చేయగలిగాం

సూర్యాపేట : లాక్ డౌన్‌ను  ప్రజలు ఎంతో క్రమశిక్షణతో అమలు చేయడంతోనే కరోనా మహమ్మారికి కళ్లెం వేయగలిగామని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిఅన్నారు. సూర్యాపేటలో కూరగాయల మార్కెట్ల ను మంత్రి  ప్రారంభించి  ప్రైవేట్ కారు డ్రైవర్ల కు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కష్ట కాలంలో పేదలపై మానవత్వం చాటుతున్న దాతలు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ముందుకెళ్తూ కరోనాను నివారిద్దామని ప్రజలకు పిలుపు నిచ్చారు.


logo