శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 20, 2020 , 01:15:43

కృష్ణ, గోదావరి బేసిన్‌ చీలికతో విపత్తు

కృష్ణ, గోదావరి బేసిన్‌ చీలికతో విపత్తు

  • l భవిష్యత్‌లో భూకంపాలు,  సునామీలు వచ్చే అవకాశం
  • l హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు

కొండాపూర్‌: ఏపీలోని కృష్ణ- గోదావరి బేసిన్‌ తీర ప్రాం తంలో ఏర్పడుతున్న చీలికలతో ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతానికి పెద్ద విపత్తులు సంభవించనున్నట్టు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) శాస్త్రవేత్తలు గుర్తించినట్టు వర్సిటీ పీఆర్వో ఆశీష్‌ జెకాబ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీయూ భూ, సముద్ర, వాతావరణ విభాగం పరిశోధకులు ప్రొఫెసర్‌ కేఎస్‌ కృష్ణ, డాక్టర్‌ ఎం ఇస్మాయిల్‌, జాతీ య సముద్ర అధ్యయన శాస్త్రవేత్త డాక్టర్‌ కే శ్రీనివాస్‌, చము రు, సహజవాయువుల శాస్త్రవేత్త డాక్టర్‌ డీ స్తహుల సంయుక్త పరిశోధనలో విశాఖ తీరప్రాంతంలో ఈ చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ చీలికలతో భవిష్యత్‌లో భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.  ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మార్పులు 16 మిలియన్‌ సంవత్సరాలు -6.8 మిలియన్‌ సంవత్సర మధ్యకాలంలో చాలాసార్లు జరిగినట్టు శాస్త్రవేత్తల బృందం పేర్కొన్నట్టు చెప్పారు. ఈ విధమైన నిలువు కోతల వల్ల 300 కిలోమీటర్ల పొడవుతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన భూకంపాలు, సునామీలు ఏర్పడి ఉంటాయని వారు భావిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ తీర ప్రాంతంలో భవిష్యత్‌లో భూ, సముద్ర సంబంధ విపత్తులు సంభవించవచ్చని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.


logo