గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 19:29:48

కేటీఆర్‌ పిలుపునకు స్పందించిన డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌

కేటీఆర్‌ పిలుపునకు స్పందించిన డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌

వరంగల్‌ అర్బన్‌: సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం  10 నిమిషాలపాటు పరిసరాల  పరిశుభ్రతపై దృష్టిసారించాలని రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ఇచ్చిన పిలుపునకు సినీ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. ఇవాళ ఉదయం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వడ్డేపల్లిలో పర్యటించిన తరుణ్‌ భాస్కర్‌.. ప్రతి ఒక్కరు  పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టడం ద్వారా మనమే కాకుండా మన జిల్లా, రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని పిలుపునిచ్చారు. అందరికీ ఆరోగ్యం కోసం  మంత్రి కేటీఆర్‌ అమలుచేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రావడం సంతోషంగా ఉన్నదన్నారు. తన చిన్నాన్న దాస్యం వినయ్‌భాస్కర్‌ కోరిక మేరకు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తరుణ్‌ భాస్కర్‌తోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా  సత్పతి, జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్‌, కార్పొరేటర్లు దాస్యం  విజయభాస్కర్‌, మిడిదొడ్డి స్వప్న తదితరులు పాల్గొన్నారు.


logo