మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:16

సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా

సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట తనతోపాటు కుటుంబసభ్యులకు జ్వరం వచ్చిందని, కరోనా టెస్టుల్లో స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా తేలిందని రాజమౌళి బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తామంతా హోంక్వారంటైన్‌లో ఉన్నామన్నారు. అంతా క్షేమంగా ఉన్నామని, పూర్తిగా కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.logo