మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 17:24:47

ఏవోసీ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన డీజీవోఎస్‌

ఏవోసీ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన డీజీవోఎస్‌

సికింద్రాబాద్ : డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఆర్డినెన్స్ స‌ర్వీసెస్‌(డీజీవోఎస్‌), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ క‌ల్న‌ల్ క‌మాండెంట్, లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఆర్‌కేఎస్ కుష్వాహా మంగ‌ళ‌వారం ఆర్మీ ఆర్డినెన్స్ కార్స్ప్‌(ఏవోసీ) సెంట‌ర్‌ను సంద‌ర్శించారు. అనావాయితీ ప్ర‌కారం జ‌న‌ర‌ల్ ఆఫీస‌ర్ హాజ‌రై గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌తో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏవోసీ సెంటర్‌లోని వార్ మెమోరియల్‌లో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ అమరవీరులకు కుష్వాహా‌ నివాళులర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏవోసీ కేంద్రంలోని అన్ని ర్యాంకుల అధికారులు హాజ‌ర‌య్యారు. సంద‌ర్శ‌న‌లో భాగంగా జ‌న‌ర‌ల్ ఆఫీస‌ర్ నూత‌నంగా నియామ‌కం అయిన వారి శిక్ష‌ణ‌ను ప‌రిశీలించారు. డీబీవోఎస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో సాధార‌ణ సంద‌ర్శ‌న‌లో భాగంగానే ఆర్‌కేఎస్ కుష్వాహా ఏవోసీ సెంట‌ర్‌ను సంద‌ర్శించారు.