శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:13

స్టాక్‌ ట్రేడింగ్‌.. 7 కోట్లు టోకరా

స్టాక్‌ ట్రేడింగ్‌.. 7 కోట్లు టోకరా

  • ముంబైకి చెందిన ఇద్దరు స్టాక్‌ బ్రోకర్‌ ఏజెంట్ల అరెస్టు
  • దాదాపు 300 మందిని మోసంచేసిన నిందితులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సెబీ నిబంధనలను ఉల్లంఘించి ఆన్‌లైన్‌ షేర్‌ ట్రేడింగ్‌లో పెట్టిన పెట్టుబడి రూ.7 కోట్లను సొంత ఖాతాల్లో జమచేసుకున్న ట్రేడింగ్‌ కంపెనీల స్టాక్‌ బ్రోకర్‌ ఏజెంట్లను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. ఈ విషయాన్ని జాయింట్‌ సీపీ అవినాశ్‌మహంతి శనివారం మీడియాకు వివరించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌కు చెందిన ప్రదీప్‌ యార్లగడ్డ ముంబైకి చెందిన అనిల్‌ కార్‌కళ ఉపాధ్యాయ మనోజ్‌ జవేరీ, కోనార్డ్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ, రాజ్‌దీప్‌ మనోజ్‌ జవేరీ, మనోజ్‌ జవేరీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఏజెంట్ల వద్ద రూ.7 కోట్లను స్టాక్‌ ట్రేడింగ్‌ కోసం 2017-2019 సంవత్సరాల్లో పెట్టుబడిగా పెట్టారు. అనిల్‌ కార్‌కళ ఉపాధ్యాయ, మనోజ్‌ జవేరీలు ఆ డబ్బును సెబీ నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత ఖాతాలో జమచేసుకొని ట్రేడింగ్‌కు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి తప్పుడు లెక్కలను చూపించారు. ప్రదీప్‌ యార్లగడ్డ తాను పెట్టుబడిగా పెట్టిన నగదును తిరిగి ఇచ్చేయాలని అడిగినప్పుడు వారు ముంబైలోని సంస్థను ఏకంగా మూసివేసి తప్పించుకొని తిరుగుతున్నారు. దీనిపై ప్రదీప్‌ యార్లగడ్డ అగస్టు 5వ తేదీన సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తుచేసిన సీసీఎస్‌ అధికారులు నిందితులను ముంబైలో అరెస్టుచేసి శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఈ నిందితులు దాదాపు 300 మందిని మోసంచేసినట్టు తేలింది. logo