శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:14:35

త్వరలో విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు!

త్వరలో విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు ప్రారంభించడంపై విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. గతంలో పది, ఇంటర్‌ విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌, యూట్యూబ్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలను అందించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అదేతరహాలో డిజిటల్‌ విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు స్కూళ్లవారీగా టీచర్లు, విద్యార్థులను గుర్తిస్తున్నారు. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అటెండెన్స్‌ అమలుచేయాలని భావిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు కూడా ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యాక్యాలెండర్‌పై మాత్రం ఎస్సీఈఆర్టీ అధ్వర్యంలో కసరత్తు చేస్తున్నారు. 


logo