ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 06:39:50

ఈనెల 20 నుంచి డిజి‌టల్‌ బోధన

ఈనెల 20 నుంచి డిజి‌టల్‌ బోధన

హైద‌రా‌బాద్: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శా‌లల్లో డిజి‌ట‌ల్‌/‌ఆ‌న్‌‌లైన్‌ బోధన అమ‌లు‌చే‌సేం‌దుకు విద్యా‌శాఖ అధి‌కా‌రులు కస‌రత్తు మొదలు పెట్టారు. ప్రైవేటు పాఠ‌శా‌లల్లో ఇప్ప‌టికే డిజి‌టల్‌ /ఆ‌న్‌‌లైన్‌ బోధన మొద‌లై‌న‌ప్ప‌టికీ ఇప్ప‌టి‌వ‌రకు విద్యా‌శాఖ అధి‌కా‌రి‌కంగా ధ్రువీ‌క‌రిం‌చ‌లేదు. దీంతో ఈ నెల 20 నుంచి ప్రైవేటు పాఠ‌శా‌లల్లో డిజి‌టల్‌ బోధన ఎలా చేప‌ట్టా‌లన్న అంశా‌లపై విద్యా‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కా‌లను విడు‌దల చేయ‌ను‌న్నది. 

డిజి‌టల్‌ పాఠాల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూ‌లు‌చే‌యడం, ఫీజుల కోసం ఒత్తిడి చేయడం వంటి చర్య‌లకు ప్రైవేటు యాజ‌మా‌న్యాలు పాల్ప‌డ‌వ‌ద్దని మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచిం‌చ‌ను‌న్నారు. డిజి‌టల్‌ బోధన పేరుతో వేధిం‌పు‌లకు గురి‌చేసే యాజ‌మా‌న్యా‌లపై చర్యలు తీసు‌కుం‌టా‌మని అధి‌కా‌రులు చెపు‌తు‌న్నారు. స్కూళ్లు తెరి‌చేంత వరకు డిజి‌టల్‌ విధా‌నం‌లోనే పాఠాలు బోధిం‌చ‌ను‌న్నారు. ప్రభుత్వ స్కూళ్లలో దూర‌ద‌ర్శన్‌, టీసాట్‌ వంటి వాటి ద్వారా పాఠాలు అందు‌బా‌టు‌లోకి తీసు‌కొ‌స్తు‌న్నారు.


logo